- Advertisement -
నవతెలంగాణ -నాగిరెడ్డిపేట్
పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నుండి పొంగిపొర్లడంతో ప్రాజెక్టును ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పార్థసింహారెడ్డి, డి.ఎస్.పి శ్రీనివాసరావు, సిఐ రాజారెడ్డి, శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో వస్తున్న ఇన్ఫ్లో ప్రాజెక్టు పరిస్థితిని డీ ఈ ఈ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు అలర్ట్ గా ఉండాలని వారు పేర్కొన్నారు. ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని తహసిల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు. వారి వెంట ఆర్ఐ మొహమ్మద్, ఇరిగేషన్ సిబ్బంది యాదగిరి ఉన్నారు.
- Advertisement -