Monday, November 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆసక్తికర ప్రాజెక్ట్‌తో తెలుగులోకి రీ-ఎంట్రీ

ఆసక్తికర ప్రాజెక్ట్‌తో తెలుగులోకి రీ-ఎంట్రీ

- Advertisement -

‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌ మేన్‌’ వంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో హీరో మహత్‌ రాఘవేంద్ర తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే ‘మంగాత, జిల్లా, చెన్నై 28 పార్ట్‌ 2’ వంటి పలు సక్సెస్‌ఫుల్‌ తమిళ చిత్రాలతో పాటు ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ వంటి బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొంత గ్యాప్‌ తరువాత మహత్‌ రాఘవేంద్ర ఇప్పుడు తిరిగి టాలీవుడ్‌కు రాబోతున్నారు. కంప్లీట్‌ బాడీ ట్రాన్సఫర్మేషన్‌, న్యూ లుక్‌తో ఆయన ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌తో మహత్‌ రాఘవేంద్ర ఓ ఇంట్రెస్టింగ్‌ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌ ముందుకు తిరిగి రావడం హ్యాపీగా ఉందని ఆయన తెలిపారు. తనను ఇప్పటిదాకా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మరోసారి తమ ప్రేమ, సహకారం అందిస్తారని ఆశిస్తున్నారు. టాలీవుడ్‌ రీ ఎంట్రీ పట్ల ఎగ్జైటింగ్‌గా ఉన్నానని, ఇది తన కెరీర్‌కు కొత్త ఛాప్టర్‌ అవుతుందని మహత్‌ రాఘవేంద్ర చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -