Friday, September 19, 2025
E-PAPER
Homeఖమ్మంపఠనంతో జ్ఞాపకశక్తి  పెరుగుతుంది..

పఠనంతో జ్ఞాపకశక్తి  పెరుగుతుంది..

- Advertisement -
  • హెచ్ఎం పరుచూరి హరిత
  • నవతెలంగాణ – అశ్వారావుపేట
  • పఠనం పెంపొందించుకోవడం వలన జ్ఞాపకశక్తితో పాటు జ్ఞానం పెంపొందుతుంది అని అశ్వారావుపేట బాలురు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు పరుచూరి హరిత అన్నారు. రీడ్ ఎ థాన్ నిర్వహణలో భాగంగా అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని విద్యార్ధులకు శుక్రవారం స్థానిక ప్రాధమిక పాఠశాలలో బాహ్య పఠన పోటీలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ  విద్యార్ధులు నిత్యం పుస్తక పఠనం చేస్తూ ఉండాలని దాని వలన అనేక కొత్త విషయాలు తెలియడంతో పాటు భాషపై పట్టు సాధించవచ్చునని అన్నారు.అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. కాంప్లెక్సు లోని 14 పాఠశాలల నుండి 28 మంది విద్యార్ధులు పాల్గొనగా ప్రధమ స్థానంలో ఎ.ఎస్.ఆర్ నగర్ పాఠశాలకు చెందిన ఓన్స్ మాధుర్య, ద్వితీయ బహుమతిని దొంతికుంట పాఠశాలకు చెందిన తేజస్విని లు గెలుపొందారు.న్యాయనిర్ణేతగా మహ్మద్ ఆలీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్సు కార్యదర్శి సత్యనారాయణ, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -