‘దమ్మిడికి పనికిరాని వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టు కోసం వాడు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు’ వంటి డైలాగ్స్‌తో ఉన్న ‘ఇడ్లీకొట్టు’ ట్రైలర్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కుబేర’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న హీరో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాలో ఓ సాధారణ వ్యక్తి పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో సినిమా ఇది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘తన తండ్రిని ఒప్పిస్తూ ‘ఇడ్లీ గ్రైండర్ కొంటే పని తేలిక అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది’ అని చెప్పే సన్నిశంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది. ధనుష్ ఈ సినిమాలో మురళి పాత్రలో నటిస్తున్నారు. తన తండ్రి దగ్గర ఉన్న సంప్రదాయ ఇడ్లీ కొట్టుతో మురళికి మంచి అనుబంధం ఉంటుంది. ఆ ఇడ్లీ బండి వాళ్ళ ఊరోళ్ళందరికీ చాలా సెంటిమెంట్.
మురళి హోటల్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లి, అరణ్ విజయ్ చేసిన అశ్విన్ పాత్రతో కలిసి పనిచేస్తాడు. వ్యాపారంలో లాభాలు పెరగడానికి మురళి సహాయం చేస్తాడు. కానీ అశ్విన్ నుంచి వచ్చే బెదిరింపులు మురళి భవిష్యత్తును మాత్రమే కాదు, తన తండ్రి పేరు, వారసత్వానికి సవాల్‌గా మారుతాయి. దాంతో మురళి ఎదుర్కోబోయే సవాళ్లు, తన గౌరవం కోసం చేసే పోరాటమే కథలో ప్రధానంగా మారుతుంది. నిత్యా మీనన్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధనుష్, నిత్యాల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి. డైరెక్టర్‌గా ధనుష్ హార్ట్ టచ్చింగ్ ఎమోషన్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. దీంతో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది అని మేకర్స్ తెలిపారు. శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ధనుష్ సినిమా అంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. ఈ సినిమాలోనూ అలాంటి మంచి కంటెంట్ ఉంది’ అని నిర్మాత రామారావు చింతపల్లి చెప్పారు.
‘ఇడ్లీ కొట్టు’ కోసం చావడానికైనా సిద్ధం
- Advertisement -
- Advertisement -