Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంధరల పెరుగుదలతో పడిపోతున్న నిజవేతనాలు

ధరల పెరుగుదలతో పడిపోతున్న నిజవేతనాలు

- Advertisement -

పర్మినెంట్‌ ఉద్యోగాల్లో కోతపెట్టి స్కీం వర్కర్లతో పనులు
నాన్‌ పర్మినెంట్‌ విధానంతో శ్రమదోపిడీ : సీఐటీయూ సంగారెడ్డి జిల్లా మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య


నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయని సీిఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అన్నారు. పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తోంద న్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సీఐటీయూ నాల్గవ మహాసభలు సదాశివపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ ధరల పెరుగుదల వల్ల కార్మికుల నిజవేతనాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగాల్లో కోతపెట్టి స్కీం వర్కర్లతో పనులు చేయిస్తున్నారని తెలిపారు.

దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకుంటున్నారని, రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయదని ప్రక టిస్తే ప్రధాని నరేంద్రమోడీ స్పందించడం లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. కనీస వేతనాలు ఇవ్వకుండా స్టైఫండ్‌ పేరుతో, ఇంటెన్సివ్‌ పేరుతో, కాంట్రాక్టు పేరుతో, ఫిక్సిడ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ పేరుతో యాజమా న్యాలు నాలుగు లేబర్‌ కోడ్ల ద్వారా దోచుకుంటున్నాయని అన్నారు. సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి కార్మికులు చనిపోతే వారి వద్ద కార్మికుల రికార్డులు లేవన్నారు. దోపిడీని ఎదిరించాలంటే ఐక్య ఉద్య మాలే పరిష్కారమని అన్నారు. ఈ మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.మల్లిఖార్జున్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.మల్లేశం, జి.సాయిలు, కె.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -