Thursday, September 25, 2025
E-PAPER
Homeఆటలుకిక్‌ బాక్సింగ్‌ సంఘానికి గుర్తింపు!

కిక్‌ బాక్సింగ్‌ సంఘానికి గుర్తింపు!

- Advertisement -

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కిక్‌ బాక్సింగ్‌ క్రీడ కార్యక్రమాల నిర్వహణ, వ్యవహారాల పర్యవేక్షణకు తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ (టిఎస్‌కెఏ)కు అధికారికంగా గుర్తింపు లభించినట్టు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌), 2022 నుంచి తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) టిఎస్‌కెఏను గుర్తించినట్టు బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం 25 జిల్లాల సంఘాలకు అనుబంధ గుర్తింపు ఇచ్చినట్టు.. రాష్ట్రవ్యాప్తంగా కిక్‌ బాక్సింగ్‌ అథ్లెట్లు, కోచ్‌లు, అకాడమీలు టిఎస్‌కెఏ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -