• ఘనంగా పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
నవతెలంగాణ -పెద్దవంగర
చదువుతోనే సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పెద్దవంగర సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్, మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్, చిట్యాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆర్రోజు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దవంగర, చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకం అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. జీవితంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నారు. పదో తరగతి విద్యార్థులు తమ పాఠశాల రోజుల్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


