- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా పాలనాధికారి, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ వినయ్ కృష్ణ రెడ్డి ఐ.ఏ.ఎస్ ని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు రెడ్ క్రాస్ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి మూడు విడతల గ్రామ పంచాయితీ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించినందుకు పూల మొక్క ఇచ్చి అభినందించారు. అలాగే రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకొని రెడ్ క్రాస్ బృందాన్ని ప్రశంసించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ , కోశాధికారి కరిపే రవీందర్,జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అబ్బాపూర్ రవీందర్,పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ పాల్గొన్నారు.
- Advertisement -



