జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్..
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న రైతులు తము పండించే వ్యవసాయ భూముల్లో యూరియా వాడడం వల్ల భూములు చెడిపోయి రైతులకు పంటలు అధికంగా పండకుండా దెబ్బతింటున్నయి. దింతో ఇప్పుడు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియాను వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ అన్నారు. బుధువారం మండలంలోని సోనారి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు అధికారులు నానో యూరియా, నానో డి ఏ పి నే పంట క్షేత్రలో వాడాలని రైతులకు అవగహన చెపట్టారు. దింతో రైతులకు అన్ని రకాల ఉపయోగాలు ఉండేలా ఉంటుందని సూచించారు.
అనంతరం బైంసా ఆత్మకమిటి చెర్మన్ సిద్ధం వివేకానంద మాట్లాడుతూ.. గ్రామమలో ఉన్న రైతులు తప్పనిసరిగా నానో యూరియా నే పంటలకు పిచికారీ చేసేలా చూడలని అన్నారు. దింతో పాటు వ్యాపారాలు మొక్క జొన్న బ్యాగులు అధిక ధరలకు విక్రహించడం జరుగుతుంది. దీనికి సంబదించిన అధికారులు అధిక ధరలు విక్రహించే వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ వీణ మండల వ్యవసాయ అధికారి సారిక విస్తర్ణ అధికారి నారాయణ, గ్రామస్తులు రైతులు తదితరులు ఉన్నారు.



