- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఉదయం నుంచి సర్వర్లు పనిచేయకపోవడంతో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూ బదలాయింపు రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోవడంతో పత్రాలు నమోదు చేసుకునేందుకు వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎప్పుడు సేవలు పునరుద్ధరించబడతాయో స్పష్టత లేదు.
- Advertisement -



