మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : పొరుగు దేశం చైనాపై పెట్టుబడి ఆంక్షలను సడలించడానికి భారత ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే.. ఇందుకోసం చైనా కూడా భారత ఎగుమతులకు అడ్డంకులను తగ్గించేందుకు సంసిద్దత వ్యక్తం చేయాల్సి ఉంటుందని మంత్రి ఓ ఇంటర్యూలో తెలిపారు. న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య మార్కెట్ లభ్యత (యాక్సెస్), టారిఫేతర అడ్డంకులపై అర్థవంతమైన చర్చలు జరగాలని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడానికి సమయం పడుతుందన్నారు. దీనికి ఇరు పక్షాల నుంచి నిబద్దత, నిజాయితీ అవసరమన్నారు. గత దశాబ్ద కాలంగా చైనాతో ఒప్పందాలు ఉన్నప్పటికీ మార్కెట్ లభ్యత సాధించలేదు, ఈ మధ్య కాలంలో అన్నీ స్తంభించాయని ఇటీవల మంత్రి పేర్కొన్నారు. అమెరికా విధించిన 50 శాతం అధిక టారిఫ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జిఎస్‌టి వంటి సంస్కరణలు, ఇతర చర్యలు తీసుకుంటున్నామన్నారు. టారిఫ్‌లతో ప్రభావితమయ్యే రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్యాకేజీని తీసుకురానుందని మంత్రి చెప్పారు. దీనిని క్యాబినెట్ ఆమోదించాల్సి ఉందన్నారు. రష్యా నుంచి నిస్సందేహంగా చమురును కొనుగోలు చేస్తామన్నారు.
చైనా పెట్టుబడులపై ఆంక్షల సడలింపు..!
- Advertisement -
- Advertisement -