– 15 పరుగులతో టీమ్ ఇండియా గెలుపు
– స్నేహ్ రానా ఐదు వికెట్ల మాయజాలం
– మహిళల ముక్కోణపు వన్డే సిరీస్
నవతెలంగాణ-కొలంబో :
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా రెండో విజయం సాధించింది. సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ స్నేహ్ రానా (5/43) ఐదు వికెట్ల మాయజాలంతో చెలరేగటంతో 277 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిలు 49.2 ఓవర్లలో 261 పరుగులకు కుప్పకూలారు. సఫారీ ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (109, 107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో మెరిసినా.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు లారా వొల్వడార్ట్ (43, 75 బంతుల్లో 3 ఫోర్లు), బ్రిట్స్ దక్షిణాఫ్రికాకు 140 పరుగులతో తొలి వికెట్‌కు తిరుగులేని ఆరంభాన్ని అందించారు. కానీ స్పిన్నర్ల మాయ మొదలవటంతో సఫారీ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. లారా (9), మెసో (7), చోలె (18), అనెరీ (30), నదినె (0)లు స్నేV్‌ా రానా మాయలో పడగా.. వొల్వడార్ట్, సునెలుస్ కథ దీప్తి శర్మ, శ్రీ చరణి ముగించారు. 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైన దక్షిణాఫ్రికా అమ్మాయిలు 15 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. ఐదు వికెట్లతో మాయ చేసిన స్నేహ్ రానా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
రాణించిన రావల్ :
యువ ఓపెనర్ ప్రతిక రావల్ (78, 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఫామ్ కొనసాగించింది. స్మృతీ మంధాన (36, 54 బంతుల్లో 5 ఫోర్లు), హర్లీన్ డియోల్ (29, 47 బంతుల్లో 4 ఫోర్లు), జెమీమా రొడ్రిగస్ (41, 32 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 నాటౌట్, 48 బంతుల్లో 4 ఫోర్లు), రిచా ఘోష్ (24, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) స్లాగ్ ఓవర్లలో విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో 50 ఓవర్లలో 6 వికెట్లకు భారత్ 276 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మాబా (2/55) రెండు వికెట్లు పడగొట్టింది.
సఫారీలపై అలవోకగా..
- Advertisement -