Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైన్స్- మూఢవిశ్వాసాలపై సదస్సు కరపత్రాల విడుదల

సైన్స్- మూఢవిశ్వాసాలపై సదస్సు కరపత్రాల విడుదల

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తా టీఎన్జీఓ ఆఫీసులో నవంబర్ 9న ‘సైన్స్ – మూడవిశ్వాసాలు’అంశంపై నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జరగనున్న ఉమ్మడి జిల్లా సదస్సు కరపత్రాలను వనపర్తి సిపిఐ జిల్లా ఆఫీసులో సోమవారం నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాస్తిక సమాజం వనపర్తి జిల్లా కార్యదర్శి భాస్కర్ తదితరులు మాట్లాడుతూ మతం మత్తుమందు అని కార్ల్ మార్క్స్ అన్నారని, ఆయా మతాలను అనుసరిస్తున్న వారు మత గ్రంథాల్లో ఎన్నో లొసువులు ఉన్న పట్టించుకోవటం లేదన్నారు. మతం ప్రభావం నుంచి ఎప్పటికప్పుడు చైతన్యం పొందుతూనే ఉండాలన్నారు. అసంఖ్యాక ప్రజలు సలక్షణమైన జీవితం గడివే పరిస్థితికి రావాలంటే ఒక సంస్కృతిక విప్లవం, భావ విప్లవం, సామాజిక విప్లవం రావాలన్నారు.

ప్రజా చైతన్యం కోసం మహబూబ్నగర్లో నిర్వహిస్తున్న సదస్సుకు వక్తలుగా ప్రముఖ విద్యావ్యత కే జయకుమార్, తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యులు అంబటి నాగయ్య తదితరులు వస్తున్నారన్నారు. సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యామంతులు విధవర్గాలప్రజలు హాజరు కావాలన్నారు. కరపత్రాలు ఆవిష్కరణలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, కవి జనజ్వాల రాధాకృష్ణ, తెలంగాణఎస్సీ ఎస్టీ బీసీమైనార్టీ కన్వీనర్ గంధం నాగరాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష ,ఉపాధ్యక్షులు శ్రీరామ్, ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, మాజీ పట్టణ సాయి కార్యదర్శి ఎర్ర కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -