నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నాందేవ్ వాడ లో ఐద్వా కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలు హత్యాచారాలు పెరిగిన నిత్యవస ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రేమోన్మాద దాడులు విద్య, వైద్యం, ఉద్యోగం, ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ దేశంలో రాష్ట్రంలో ఐద్వా గుర్తింపు పొంది దేశంలో ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచింది. కావున అందరూ ఆలిండియా మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి సుజాత జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా కమిటీ సభ్యురాలు కవిత జిల్లా కమిటీ సభ్యులు హసీనా బేగం నగర నాయకులు శ్రీదేవి, రేఖా, యశోద, రజియా, తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా మహాసభల కరపత్రాల విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



