– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్ రావు గుప్తాతో ఫోన్ లో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వర్షాలు లేని క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్సారెస్పీ ఎస్.ఈ ని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారు ఫోన్ లో ఆయనతో మాట్లాడారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ తో పాటు సాగు నీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి, వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రధానంగా నాలుగు డిమాండ్స్ ను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.లక్ష్మీ కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని, కాకతీయ కాలువ నీటిని కొంత విడుదల చేస్తే ఉప్లూర్ వద్ద గేట్లు వేసుకుంటారని, ఆ నీటికి పంట పొలాలకు మల్లించుకుంటారన్నారు. అదే పద్ధతిన వరద కాలువలో కొంత నీటిని కూడా వదిలితే గేట్లు వేసి ఆపుకుని పొలాలకు మళ్లించుకుంటారని తెలిపారు.పవర్ హౌజ్ నుండి వెళ్లే వృధా నీటిని గోదావరి నదిలోకి దిగువన వదిలితే పశువులకు తాగునీటికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్న ఆయన వెంటనే పై అధికారులకు, ప్రభుత్వానికి రైతుల కోరికను తెలియజేసి ఎస్సారెస్పీ నుంచి తగినంత నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
లక్ష్మీ కాలువ-కాకతీయ వరద కాలువలకు కొంత నీటిని వదలండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES