Sunday, November 2, 2025
E-PAPER
Homeసినిమాబాలల దినోత్సవం కానుకగా రిలీజ్‌

బాలల దినోత్సవం కానుకగా రిలీజ్‌

- Advertisement -

నైనిషా క్రియేషన్స్‌ బ్యానర్‌పై పులివెందుల మహేష్‌ రచన, దర్శకత్వంలో గంగాభవాని నిర్మించిన చిత్రం ‘స్కూల్‌ లైఫ్‌’. బాలల దినోత్సవ సందర్భంగా ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పులివెందుల మహేష్‌ హీరోగా, సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. సుమన్‌, ఆమని, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు కీలకపాత్రలను పోషించారు.
క్రౌడ్‌ ఫండింగ్‌ రూపంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు మహేష్‌ తల్లిదండ్రులు లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఒక రైతు పాత్రలో రైతులకు అండగా నిలబడేలా నా పాత్ర ఉండబోతుంది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు’ అని తెలిపారు.
‘ఈ సినిమా కోసం నేను ఎన్నో పోగొట్టుకున్నాను. ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వచ్చాను. సినిమాలు బతకాలి. అందుకే నేను ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో ఈనెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చిన్న సినిమాలను సపోర్ట్‌ చేయండి. భవిష్యత్తులో కొత్త వారికి నా బ్యానర్‌ సపోర్ట్‌గా నిలుస్తుంది. క్రౌడ్‌ ఫండింగ్‌ చేసి ఈ సినిమాను పూర్తి చేసాము. ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వారంతా ఒకప్పుడు కొత్త వారే. మా సినిమా టికెట్‌ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉండబోతుంది’ అని దర్శకుడు, హీరో పులివెందుల మహేష్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -