Saturday, January 17, 2026
E-PAPER
Homeబీజినెస్రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కు రూ.18,645 కోట్ల లాభాలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కు రూ.18,645 కోట్ల లాభాలు

- Advertisement -

ముంబయి : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో రూ.18,645 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.18,540 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.2,43,865 కోట్ల రెవెన్యూ నమోదు చేయగా.. గడిచిన క్యూ3లో 10.5 శాతం పెరుగుదలతో రూ.2,69,496 కోట్లకు చేరింది. ఎప్పటిలాగే అన్ని విభాగాల్లో స్థిరమైన, మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేశామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సిఎండి ముకేష్‌ అంబానీ పేర్కొన్నారు. గడిచిన క్యూ3లో రిలయన్స్‌ జియో రెవెన్యూ 12.7 శాతం పెరిగి రూ.37,262 కోట్లకు చేరగా.. లాభాలు 11.2 శాతం పెరిగి రూ.7,629 కోట్లుగా నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -