Sunday, October 12, 2025
E-PAPER
Homeబీజినెస్రిలయన్స్‌ పవర్‌ సీిఎఫ్‌ఓ అరెస్ట్‌

రిలయన్స్‌ పవర్‌ సీిఎఫ్‌ఓ అరెస్ట్‌

- Advertisement -

నకిలీ బ్యాంక్‌ గ్యారంటీ కేసులో ఈడీ నిర్ణయం

ముంబయి : రిలయన్స్‌ గ్రూప్‌లోని రిలయన్స్‌ పవర్‌కు చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ (సీిఎఫ్‌ఓ)గా ఉన్న అశోక్‌ కుమార్‌ పాల్‌ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. రూ.68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీకి సంబంధించి ఆయన ప్రమేయం ఉండటంతో ఈడీ తన కస్టడిలోకి తీసుకుంది. అనిల్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న అశోక్‌ కుమార్‌ను శుక్రవారం ఇడి ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

రూ.17వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో రిలయన్స్‌ పవర్‌ సహా అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలపై ఇడి దర్యాప్తు చేస్తోంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఎ) కింద అదుపులోకి తీసుకోగా.. శనివారం ఉదయం ఢిల్లీ కోర్టులో హాజరు పర్చినట్లు తెలుస్తోంది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)కి సమర్పించిన రూ.68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్‌ గ్యారంటీని రూపొందించడంలో అశోక్‌ కుమార్‌ కీలక పాత్ర పోశించారనేది ప్రధాన అరోపణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -