- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. మరోవైపు హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈక్రమంలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేసింది.
- Advertisement -