ఎంఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
తెలంగాణ సాయుధ పోరాటంలో కుల మతాలకతీతంగా ప్రజలు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేశారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం నాడు తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు అనే అంశంపై జరుగుతున్న సదస్సుకు ఆలేరు నుండి బయలుదేరే ముందు మాట్లాడారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ లు హిందూ ముస్లిం పంచాయతీలాగా చూపెట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టించే కుటిల ప్రయత్నాలను యువత మీడియా మేధావులు వాస్తవాల ఆధారంగా ప్రజలకు తెలుపాలన్నారు.
నైజాం నవాబు సైన్యానికి ఎదురొడ్డి ఆలేరు లో రైల్వే గేటు వద్ద కొలనుపాక రోడ్లో సీపీఐ(ఎం) కార్యాలయం ఉన్న ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1947 సంవత్సరంలో ప్రజా ప్రదర్శన నిజాం నిరంకుషాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంటే నైజాం సైన్యం అక్కడికి చేరుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో పూసలోజు వీరయ్య రెండ్ల పుల్లయ్య ఎలగందుల లక్ష్మీ నరసయ్య బీరు నారాయణ చిన్నం సాయిలు లాంటి కమ్యూనిస్టు కార్యకర్తలు కాల్పుల్లో మరణించారు. మాజీ ఎమ్మెల్యే ఏసి రెడ్డి నరసింహారెడ్డి తొడ నుండి తూటా దూసుకెళ్లింది. నిజాలు ఇలా ఉంటే బిజెపి ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తూ చరిత్ర వక్రీకరించాలని చూడడం సిగ్గుచేటు అన్నారు. వీరితోపాటు మొరిగాడి రమేష్ గణగాని మల్లేష్ వడ్డేమాన్ బాలరాజ్ కాసుల నరేష్ గణగాని రాజు బర్ల సిద్ధులు వడ్డేమాన్ విప్లవ్ కూరెళ్ళ రవి ఎర్ర రాజు ఎండి అమిర్ సదస్సుకు తరలి వెళ్లారు.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతోన్మాదులు వక్రీకరిస్తున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES