వనపర్తి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గౌరీదేవిపల్లి గన్యాగుల గ్రామస్తులు
నవతెలంగాణ – వనపర్తి : కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్యాకేజ్ -29 లో భాగంగా డి-1 కాలువ గత కొన్ని సంవత్సరాలుగా గౌరీదేవిపల్లి, గన్యాగుల, వెనచర్లకు వెళ్లే మార్గంలోని కాలువ మరమ్మతుకు వనపర్తి ఎమ్మెల్యే జెసిబిని పంపి శుక్రవారం పనులు ప్రారంభించారు. డి వన్ కాలువ పరిధిలో కాలువకు అక్కడక్కడ ఇబ్బందులు నెలకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రాబోయే వారం పది రోజులలో కాల్వకు నీళ్లు వదులనున్నారు. ఈ మరమ్మతుల విషయాన్ని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి ఆయా గ్రామస్తులు విన్నవించారు.
దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆయా గ్రామ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వెంటనే మరమ్మత్తులకోసం హిటాచిని, కాల్వకు సంబంధించిన ఏఈ, డిఈ లను పంపించి పనులను ప్రారంభింప జేశారు. కాలువకు మరమ్మతులు చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే తూడి మెగారెడ్డికి గౌరీదేవిపల్లి గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీదేవిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కేఎల్ఐ ప్యాకేజ్-29లో కాలువకు మరమ్మత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES