- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని చీలాపూర్ గ్రామంలో గుంతలతో బురదమయమైన వీధీ రోడ్లకు యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శానగొండ శరత్ కుమార్ గురువారం మట్టితో పూడ్చి మరమ్మతులు చేశారు. చిన్నపాటి వర్షానికి వీధీ రోడ్లు బురదమవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..గ్రామానికి తన వంతుగా మట్టితో మరమ్మతులు చేయించానని శరత్ కుమార్ తెలిపారు. గుంతలు పూడ్చడంతో పలువురు గ్రామస్తులు శరత్ కుమారుకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -