నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలోని చైతన్య భారతి హై స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణ ధరించి మండల కేంద్రంలో ప్రధాన వీధిలో వీధులగుంట తిరుగుతూ జాతీయ నాయకులను స్మరించుకుంటూ, స్వాతంత్ర ఉద్యమంలో అశువులు బాసిన సమరయోధులను జోహార్లు చెప్పుకుంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, తెలంగాణ తల్లి, సుభా చంద్రబోస్ వేషధారణలో విద్యార్థులను సూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి.
అనంతరం పాఠశాలలో జాతీయ గీతాలకు విద్యార్థుల నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులలో ఉన్న నైపుణ్యతను వెలికి తీసి వారికి అర్థమయ్యే రీతిలో విద్యను అందించడమే చైతన్య భారతి హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుల లక్ష్యమని చెప్పారు. ప్రతి విద్యార్థి కూడా తన యొక్క లక్ష్యాన్ని ఎంచుకొని అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు. అనంతరం ఆట పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిబి మాథ్యూ, ప్రధానోపాధ్యాయులు ధనుంజయ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు , తదితరులు పాల్గొన్నారు.



