- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిప కే.అశోక్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ప్రజాస్వామ్య వ్యవస్థ పౌరులందరూ భాగస్వామ్యం పొంది బాధ్యతాయుతంగా నడుచుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



