- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



