Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

ప్రభుత్వ కార్యాలయాలలో విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు పంపిణీ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

గణతంత్ర దినోత్సవ వేడుకలు  మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో విద్యాసంస్థలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో సోమవారం మువ్వన్నెల జెండాలు ఎగురవేసినారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రాముఖ్యత వివరించి, మిఠాయిలు పంపిణీ చేసి,విజేతలకు బహుమతులు అందజేసి ఘనంగా నిర్వహించారు.

తహసిల్దార్ కార్యాలయంలో లో తహసిల్దార్ చంద నరేష్, మండల పరిషత్ లో ఎంపీడీవో కుమార్, పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ జి యాకయ్య, సెర్ఫ్ లో ఏపీఎం నరేంద్ర కుమార్, ఎమ్మార్సీ ఎంఇఓ రాందాస్,కేజీబీవీ ప్రిన్సిపాల్ సుమలత, మోడల్ స్కూల్ ఉపేందర్ రావు, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పరుపాటి వెంకట్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నెల్లికుదురులో ఆ సంఘం పర్సన్ ఇన్చార్జి జాకోజ్ మనోహర్రావు, శ్రీరామగిరి పి ఎస్ సి ఎస్ లో సీఈవో కత్తుల వెంకన్న, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమ్య, పశు వైద్య శాలలో డాక్టర్ సోమ శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ అరిగకుడి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు యాకయ్య, నెల్లికుదురు  గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి తో కలిసి సర్పంచ్ పులి వెంకన్న, బ్రాహ్మణ కొత్తపల్లి చిర్ర యాకాంతం గౌడ్, రావిరాల కత్తుల కళ్యాణి, హనుమాన్ నగర్ తండా(తారా సింగ్ బావి) భూక్య అశోక్, నల్లగుట్ట తండాలో సర్పంచ్ హేమలత శ్రీను, ఎర్రబెల్లి గూడెం గ్రామంలో సర్పంచ్ గుండెబోయిన అశోక్, సౌల తండాలో సర్పంచ్ సుజాత వాస్, సీతారాంపురం గ్రామంలో సర్పంచ్ భాస్కర్, నైనాల యాసం సంధ్య తో పాటు అన్ని గ్రామాల్లో ఆయా సర్పంచులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -