నవతెలంగాణ – బాల్కొండ
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు జావీద్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పెసరి వివేక్, నాయకులు మహమ్మద్ అన్వర్, యూనుస్, కుంట సంతోష్ గౌడ్, హరికృష్ణ ,ఆరేపల్లి గంగాధర్, సల్లావుద్దీన్, పద్మారావు, నరేష్, రవి గౌడ్, కపిల్, నాగేష్, దోన్పాల్ సాయన్న, మహమ్మద్ ఆరిఫ్, మెట్టు అశోక్, మేక సతీష్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



