Wednesday, January 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మహిళా సంఘ భవనం నిర్మించాలని వినతి

మహిళా సంఘ భవనం నిర్మించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
ముధోల్  మండలంలోని బొరిగాం గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాలకు రెండు నూతన భవనాలు నిర్మించాలని మహిళా సంఘాల సభ్యులు మంగళవారం రోజు సర్పంచ్ కల్లేడ కిష్టయ్య కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఉన్న 60 మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెల సమావేశం నిర్వహించుకోవటానికి భవనం లేకపోవడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. వేంటనే నూతనంగా రెండు భవనలు వేర్వేరుగా నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. దీంతో సర్పంచ్ స్పందించారు. భవనం నిర్మాణానికి నిధుల మంజూరు కోరకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఎంపిఎం గురు చరణ్,సి.సి సాయినాథ్,వివోఎ ఎర్రం ముత్తవ్వ,గ్రామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు లింగవ్వ, లక్ష్మి, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -