Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

- Advertisement -

నవతెలంగాణ – అలంపూర్
రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు పెండింగ్ నిధులు తక్షణమే చెల్లించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ.పరంజ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు కోరారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు కు కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు వరంజ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు చెల్లించాల్సిన 180 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో 30 వేల మంది దళిత, గిరిజన విద్యార్థులు రోడ్డున పడ్డారని అన్నారు.

గత వారం రోజులుగా పాఠశాలలకు వెళ్ళకుండా పిల్లలు పడిగాపులు కాస్తూ దయనీయమైన పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నెలకొందని ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు గత 25 ఏళ్ల క్రితం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రాథమిక తరగతిలో ఒక్క విద్యార్థికి ఏటా 28వేలు, ప్రాథమి కొన్నత తరగతిలో వసతితో కలిపి 42 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎంపిక చేసిన 230 ప్రైవేటు పాఠశాలలో ఉచితంగా విద్య భోజనం పుస్తకాలు, బట్టలు వసతి కల్పిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిధులను చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 180 కోట్ల రూపాయలను ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించలేదని అన్నారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో ఈ పథకంలోని విద్యార్థులకు విద్యతో పాటు భోజనం వసతి కల్పించడం లేదని, ఈనెల 6 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సమ్మె చేస్తున్నాయని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది దళిత, గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో దళిత విద్యార్థుల కోసం 11బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను ఎంపిక చేశారని, వీటిలో 682 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి 2025 -26 విద్యా సంవత్సరానికి  1కోటి 76 లక్షల 73 వేలు రావాల్సి ఉండగా 62 లక్షల 73వేలు  మొదటి విడతలో వచ్చాయని అవి కూడా ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో ట్రెజరీలో పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఎస్టి విద్యార్థుల కోసం 2 పాఠశాలలను ఎంపిక చేశారని,  వీటిలో 44 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరికి 2024-25 విద్యా సంవత్సరానికి 13 లక్షల 20వేలు వచ్చాయని 2025-26 విద్యా సంవత్సరానికి ఒక్క పైసా ప్రభుత్వం కేటాయించలేదని విమర్శించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే, ఇన్చార్జి మంత్రితో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్,  కే వెంకటస్వామి, ప్రభాకర్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -