నవతెలంగాణ- ఆలేరు రూరల్
బీసీల 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే ఆమోదం తెలపాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మార్వో ఆంజనేయులు కి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. బీసీలకు రావలసిన వాటాను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎగరగొట్టింది. అనేక సంవత్సరాలుగా బీసీలు వెనుకబడి ఉన్నారు.ఇప్పటికైనా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలను ముమ్మరం చేస్తాం అని హెచ్చరించారు. అదే విధంగా రేపు జరగనున్న రాష్ట్ర బంద్‌కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతూ,పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి గొట్టిపాముల శ్రీనివాస రాజ్, సహాయ కార్యదర్శి బొడ్డు ఆంజనేయులు, జానమ్మ,స్వామి తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎమ్మార్వోకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES