నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఖండేబెల్లూర్ గ్రామంలో ఉన్న వైద్య సబ్ సెంటర్ వద్ద గల అపరిశుభ్రతను వెంటనే తొలగించాలని జుక్కల్ ఎమ్మార్వో మారుతికి గ్రామస్తులు, యువకులు శుక్రవారం వినతిపత్రం అందించారు. ఆరోగ్య సబ్ సెంటర్ వద్ద నిత్యం గ్రామానికి చెందిన పశువులు సేద తీర్చేందుకు నిలబెట్టడంతో ఆ ప్రాంగణమంతా పశువుల పేడతో అపరిశుభ్రంగా మారుతోందని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సబ్ సెంటర్ మందు భాగంలో ప్రాంగణమంతా గుంతలు, బురద ఏర్పడిందని తెలిపారు. దీంతో వెంటనే గుంతలను పూడ్చి మట్టిని వేయించాలని కోరారు. ఇందుకు వెంటనే స్పందించిన ఎమ్మార్వో.. ఆరోగ్య సబ్ సెంటర్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని జీపీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. 10 నుంచి 20 ట్రిప్పుల వరకు మట్టి వేయించుకోవాలని గ్రామస్తులకు ఎమ్మార్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
ఖండేబల్లూర్ లోని అపరిశుభ్రతను తొలగించాలని ఎమ్మార్వోకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES