Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీత కార్మికులకు పెన్షన్ అందించాలని వినతి

గీత కార్మికులకు పెన్షన్ అందించాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రానికి చెందిన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు గురువారం నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఘనంగా  సన్మానించారు. ఈ సందర్బంగా వారు తమ గౌడ వృత్తి చేసుకునే గీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారికీ, పించిన్ అందించే విధంగా చూడాలని కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ లకు వినతి పత్రము అందించారు.

గీత కార్మికులు తమ వృత్తిని నమ్ముకొని చాలి చాలని ఆదాయంతో కొట్టు మిట్టడుతున్న కార్మిక సోదరులు జీవనం కొనసాగిస్తున్నారని సంఘ సభ్యులు ఆవేదన వక్తం చేస్తూ వారిని పెన్షన్ అందించి ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమములో సంఘం అధ్యక్షులు జె. నరేందర్ గౌడ్, ఎన్ చిన్న గంగాధర్, జలంధర్ గౌడ్, బి రాజేందర్ గౌడ్, వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -