- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి: పసుపు ఉత్పత్తిదారుల సంఘాలకు సబ్సిడీ విడుదల చేయాలని నిజాంబాద్ టర్మరిక్ బోర్డ్ ఆఫీసులో ఫామ్ మేనేజర్ రాణికి, ఆఫీస్ అసిస్టెంట్ జవహర్ కి .వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జయం కేపిఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు పాటుకురి తిరుపతి రెడ్డి , కార్టికల్ పసుపు రైతు ఉత్పద్దాల సంఘం అధ్యక్షులు సామల భీమారెడ్డి , డైరెక్టర్ ధనూరి రాజారెడ్డి, పి. సంతోష్ రెడ్డి సీఈవో సుమన్ పాల్గొనడం జరిగింది.
- Advertisement -



