- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆగస్టు 18వ తేదీన పాపన్న జయంతి ఉత్సవాలను యాదాద్రి జిల్లా కేంద్రంలో ఉన్న గుట్టపైన అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించాలని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు కప్పల రవికుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పరకాల అంజయ్య గౌడ్, రాజు గౌడ్, సత్యనారాయణ గౌడ్, మల్లేష్ గౌడ్ లు పాల్గొన్నారు.
- Advertisement -