- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలకు రోడ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హైదరాబాద్ లో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ముధోల్ నియోజకవర్గ లో వానల్ పాడ్ నుండి వంజార ,సోనారి నుండి కుబీర్ ,మలేగావ్ నుండి వర్ని రోడ్డు నిర్మాణాల కొరకు హమ్ లో నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిన మంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట యువ నాయకులు పట్టెపురం సతీష్ రెడ్డి,గంగాధర్ ఉన్నారు.
- Advertisement -



