Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిజర్వేషన్ మురిపించే.. ఒక్క ఓటు లేక పాయె 

రిజర్వేషన్ మురిపించే.. ఒక్క ఓటు లేక పాయె 

- Advertisement -

ఒక్క ఓటు లేక పోయిన రిజర్వేషన్ వెల్లడి
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పాటు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులకు ఆనందం అంతులేకుండా పోయింది. కాగా కొన్నిచోట్ల గ్రామ నాయకులతో పాటు ఓటర్లకు సైతం షాక్ ఇచ్చే విధంగా రిజర్వేషన్లు ప్రకటించారు అధికారులు. రిజర్వేషన్ల ప్రకటనతో పలుచోట్ల నాయకులు ఓటర్లు పోటీ చేసే వ్యక్తులను అద్దెకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఓటు కూడా లేని నసురుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పంచాయతీ సర్పంచి ఎస్టీకి రిజర్వేషన్ రావడంతో గ్రామ ప్రజలతో పాటు నాయకులు ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. అంకోల్ గ్రామపంచాయతీ పరిధిలో ఎస్సీ ఓట్లు 143, బీసీ ఓట్లు 575, ఓసీ ఓట్లు 63, ఎస్టీ ఓట్లు 0 ఒక్క ఓటు కు లేదు. మొత్తం ఓట్లు 781 ఓట్లు ఉన్నాయి.

ఆ గ్రామంలో ఎస్టీ కి సంబంధించి ఒక్క ఓటు కూడా లేకపోవడంతో ఎవరు పోటీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉపసర్పంచే.. సర్పంచిగా కొనసాగనున్నారా.. లేదా మరొక రిజర్వేషన్ కేటాయిస్తారా అనే విషయం తెలియక ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం అంకోల్ గ్రామ జనాభా ఎస్సీ 270, ఎస్టి 55, బీసీ, ఓసీ కలుపుకొని 708 మంది ఉండే, కొత్త ఓటర్ల సవరణలో ఓటర్లు మార్పులు చేర్పులు చేసుకోవడంతో గ్రామాల్లో ఎస్టి జనాభా లేకుండా పోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలుపుతున్నప్పటికీ ప్రస్తుత ఓటర్ లిస్ట్ లో ఎస్టీ కి చెందిన వ్యక్తులు లేకపోయినా రిజర్వేషన్ కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో ఆ గ్రామాలకు సర్పంచ్ లేకుండానే వార్డు సభ్యులకు మాత్రమే ఎన్నికల నిర్వహిస్తారా… మరో రిజర్వేషన్ కేటాయిస్తారా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రకటించినట్లు అధికారులు తెలుపుతున్నారు. గతంలో అంకోల్ తండా గ్రామానికి చెందిన కొందరు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్లు ఉండేవారు. నూతనంగా ఏర్పడిన కొత్త గ్రామ పంచాయతీల ఓటర్ జాబితాను కొత్తగా తయారు చేయడంతో ఎస్టీ కి చెందిన ఓటర్ లేకుండానే ఆ సామాజిక వర్గానికి సర్పంచ్ రిజర్వ్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదని నాయకులతోపాటు ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉపసర్పంచే… సర్పంచిగా కొనసాగేనా..?

ఒక్క ఓటు లేని సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించిన గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆ గ్రామంలో సర్పంచ్ గా ఎవరు ఎన్నిక కారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికలలో ఉప సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందా.. లేదా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఉప సర్పంచ్ , సర్పంచ్ గా కొనసాగి పరిస్థితి ఏర్పడితే ఆ గ్రామాలలో ఉపసర్పంచ్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండే అవకాశాలు ఉంటుంది. 

రిజర్వేషన్ మార్పు జరిగేనా..

ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ప్రకటించారో.. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్ లేకపోతే ఆ గ్రామంలో రిజర్వేషన్ మార్పు జరుగుతుందా లేదా అని ఆ గ్రామాల ప్రజలతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. కానీ అధికారులు మాత్రం మండలాన్ని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం వలన కొన్నిచోట్ల రిజర్వేషన్లు అనివార్యమైనట్లు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి పునర్ ఆలోచన చేపట్టనున్నట్లు తెలుస్తుంది. కేటగిరికి చెందిన ఓటర్ లేకుండానే రిజర్వేషన్ కల్పించిన గ్రామాలలో ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచి అభ్యర్థి లేకుండానే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలు పార్టీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేటగిరికి చెందిన ఓటర్ లేని చోట రిజర్వేషన్ మార్పు చేయాలని గ్రామాల ప్రజలతో పాటు నాయకులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -