నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని గర్నెకుంట గ్రామ పంచాయతీలో శుక్రవారం సర్పంచి పిల్లి కొండలు, ఉపసర్పంచి చెరుకుపల్లి చంద్రమౌళి అధ్యక్షతన వార్డు సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించారు. గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిపై ప్రతి పాదనలు చేశారు. గ్రామంలో పారిశుధ్యం, సక్రమంగా తాగునీటి వనరులు, గ్రామ పంచాయతీ మోటార్ కు నూతన స్టార్టర్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు గేట్ వాల్ ఏర్పాటు చేయాలని గ్రామసభ తీర్మానం చేసింది. దానిని కార్యదర్శి నామ రమేష్ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాణాల కౌంసమ్మ, మెండే శంకరయ్య, పుట్టపాక మంజుల, కట్టే బోయిన రాంబాబు, పంగ రేణుక, చెరకుపల్లి సరిత, నడ్డి శంకరయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి పనులపై తీర్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



