మంత్రి పొంగులేటికి రెవెన్యూ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ లచ్చిరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చి రెవెన్యూ ఉన్నతాధికారులతో శాఖాపరమైన సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎల్‌ఏ లోకేశ్‌కుమార్ సమక్షంలో రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి నేతృత్వంలో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాములు, టీజీటీఏ ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రెటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి భిక్షం, కోశాధికారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



