Thursday, January 22, 2026
E-PAPER
Homeకరీంనగర్నవతెలంగాణ కథనానికి స్పందన..

నవతెలంగాణ కథనానికి స్పందన..

- Advertisement -

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మత్తులు
నవతెలంగాణ – రాయికల్

ఈ నెల 12న ఇటిక్యాల-రేగుంట బ్రిడ్జిపై భగీరథ పైప్‌లైన్ లీకేజ్ అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. లీకేజీ ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వెంటనే పైప్‌లైన్‌కు మరమ్మత్తులు చేపట్టారు.

అధికారుల పర్యవేక్షణలో దెబ్బతిన్న భాగాన్ని సరిచేసి,నీటి సరఫరా నిలకడగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం లీకేజీ సమస్య పూర్తిగా పరిష్కారమైందని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా జరుగుతోందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పైప్‌లైన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తామని వారు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -