- Advertisement -
రహదారిపై గుంత పూడ్చివేత
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల-కొయ్యుర్ రోడ్డుపై భారీ గుంత, అనే కథనం నవతెలంగాణ దినపత్రిక వరంగల్ ఏపీసీన్ లో ఆదివారం ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథనానికి తాడిచెర్ల కాపురం బ్లాక్-1లో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ అధికారులు స్పందించారు. రోడ్డుపై ఉన్న గుంతను డోజర్, జేసిబి ద్వారా మట్టిపోయి పూడ్చారు. అలాగే తాడిచెర్ల నుంచి మల్లారం మీదుగా కొయ్యుర్ నాగులమ్మ క్రాస్ వరకు ఉన్న చిన్నచిన్న గుంతలను ఎర్రమొరంతో పూడ్చారు. ఇందుకు రోడ్డుపై నిత్యం వెళ్లే ప్రయానికులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



