Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ కథనానికి స్పందన..

నవతెలంగాణ కథనానికి స్పందన..

- Advertisement -

బీరెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిని బదిలీ చేసిన అధికారులు 
నవతెలంగాణ – తాడ్వాయి 

మండల పరిధిలోని బీరెల్లి గ్రామపంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి చందులాల్ ను మే 20న సోమవారం “సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి,” ఈ కార్యదర్శిని బదిలీ చేసి మా ఊరు(బీరెల్లీ)కి మంచి కార్యదర్శి వేయాలి అని ” నవతెలంగాణ దినపత్రిక ప్రచురించింది. ఈ కథనానికి అధికారులు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఈ నెల3న కన్నాయిగూడెం మండలం రాజన్నపేట్ గ్రామానికి ఆయనను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి ఆ గ్రామానికి రాజన్నపేట గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి “స్రవంతి” ని బీరెల్లీ గ్రామ పంచాయతీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సందర్బంగా బీరెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు కలెక్టర్ కు, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా విధుల నుండి బదిలీ అయిన పంచాయితీ కార్యదర్శి అంత లోపల ఏజెన్సీకి వీధులకు పోవడానికి అంగీకరించకుండా అధికారులతో బేరసారాలు చేసి, దగ్గరి ప్రాంతంలో గల గ్రామపంచాయతీలో ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి పైరవీలు చేస్తున్నట్లు వినికిడి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -