Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలునవతెలంగాణ కథనానికి స్పందన..

నవతెలంగాణ కథనానికి స్పందన..

- Advertisement -

ఎమ్మెల్యే పట్టుదలతో నాసిరకం సీసీ రోడ్డును రెండోసారి నిర్మాణం పనులు ప్రారంభం
నవతెలంగాణ – మద్నూర్
: మద్నూర్ మండల కేంద్రంలో రూ.55 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు నాసిరకంగా వేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్  కారణమా లేక  అధికారుల నిర్లక్ష్యమా అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన వార్తకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు స్పందించారు. నాసిరకం పనులతో నిర్మించిన సిసిరోడ్డును మళ్లీ రెండోసారి నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పట్టుదలతో మద్నూర్ మండల కేంద్రంలో మళ్లీ సిసి రోడ్డు నిర్మాణం పనులు మంగళవారం కాంట్రాక్టర్ ద్వారా అధికారులు ప్రారంభింపజేశారు. అభివృద్ధి పనులు ఎలాంటి లోపాలు ఉండకూడదని నాసిరకం పనులు చేపడితే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే తెలిపారు. సిసి రోడ్డు పనులు ప్రారంభింప చేయడం పట్ల ఎమ్మెల్యే కృషిని గుర్తించిన ప్రజలు, గ్రామస్తులు ఎమ్మెల్యే పట్టుదలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad