Thursday, October 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్నవతెలంగాణ వెబ్ కథనంకు స్పందన…

నవతెలంగాణ వెబ్ కథనంకు స్పందన…

- Advertisement -

– ఆసుపత్రిలో మందులు తడవకుండా చర్యలు…
నవతెలంగాణ -ముధోల్ :
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షంతో గురువారం మందులు తడిసిపోవటంతో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ అనిల్ జాదవ్ తక్షణ చర్యలు చెప్పట్టారు. గురువారం నవతెలంగాణ దినపత్రిక వెబ్ పెజీలో ముధోల్ ఆసుపత్రిలో వర్షంతో తడిసిన మందులు అనే శీర్షికతో కధనం వచ్చిన విషయం తెలిసిందే. దింతో వైద్య సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శిధిలావస్థలో ఉన్న ఆసుపత్రి బారీ వర్షం తో ఉరుస్తుండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా మందులను తడవకుండా నిల్వ చేశారు. ఆసుపత్రిలో పలుచోట్ల వర్షంతో ఊరకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు.  రోగులకు   ఇబ్బంది కలుగకుండా వైద్యాధికారి అన్నిచర్యలు తీసుకున్నారని తహశీల్దార్ శ్రీలత నవతెలంగాణ కు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -