Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ కథనాలను స్పందన..

నవతెలంగాణ కథనాలను స్పందన..

- Advertisement -

ముక్కలైన సోమన్ పల్లి చెక్ డ్యామ్ ను పరిశీలించిన హైదరాబాద్ ఏప్.ఎస్.ఏల్ టీం
నవతెలంగాణ – మల్హర్ రావు

భూపాలపల్లి-పెద్దపల్లి జిల్లాల సరిహద్దులైన అడవి సోమన్ పల్లి-వళ్లెంకుంట మానేరుపై కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ మూడు రోజుల క్రితం ముక్కలైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నవ తెలంగాణ దినపత్రికలో,ధ్వంసమైన చెక్ డ్యామ్, చెక్ డ్యామ్ కొత్యుకపోయిందా.?..కులగొట్టారా..? వరుసగా కథనాలతో స్పందించిన సంబంధించిన ఉన్నతాధికారులు శనివారం హైదరాబాదు నుండి ఎఫ్ఎస్ఎల్ టీం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వెంకట్రాజ్యం అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్, భూపాలపల్లి క్లూస్ టీం అండ్ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ మార్కండేయ చెక్ డ్యామేజిని పరిశీలించారు.ఎఫ్.ఎస్.ఎల్.టీం 30 శాంపిల్స్ ఇసుక,సిమెంట్ విత్ కాంక్రీట్ తదితర వాటిని ల్యాబరేటరీ పరీక్షల నిమిత్తం సేకరించారు. నాణ్యతలోపం ద్వారా చెక్ డ్యామ్ ముక్కలైయిందా….లేదా ఎవరైనా బ్లాస్టింగ్ చేశారనేది కొద్దీ రోజుల్లోనే తెలియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -