- Advertisement -
గ్రోమోర్ రైతు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏఓ..
నిబందనల ప్రకారం యూరియా అందించాలని హెచ్చరిక
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు కేంద్రం నిర్వహాకుల వ్యవహరణ తీరుపై ప్రత్యామ్నాయంగా తీసుకుంటేనే యూరియా! అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక ఈ నెల 3న వార్తను ప్రచురించింది. సోమవారం ఏఓ సంతోష్ గ్రోమోర్ రైతు కేంద్రాన్ని సందర్శించి యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రత్యామ్నాయంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు అంటగట్టకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు యూరియా అందించాలని ఏఓ గ్రోమోర్ కేంద్రం నిర్వహాకుడు అనిల్ ను హెచ్చరించారు.
- Advertisement -