Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి కొనుగోలులో నిబంధనలు ఎత్తివేయాలి 

పత్తి కొనుగోలులో నిబంధనలు ఎత్తివేయాలి 

- Advertisement -

రైతు సంఘం జిల్లా నాయకులు చిట్యాల రాజిరెడ్డి 
నవతెలంగాణ – కట్టంగూర్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో నిబంధనలను ఎత్తివేసి అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ రైతు సంఘం జిల్లా నాయకులు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన కట్టంగూర్ లో విలేకరులతో మాట్లాడారు. సిసిఐ కొనుగోలు కేంద్రాలలో నిబంధనలతో రైతులు తమ పత్తిని అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ పై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించలేదని దాంతో రైతులు కేంద్రాల వద్దకు పత్తి తీసుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన తొలగించి గతంలో మాదిరిగా కొనుగోలు చేయాలని కోరారు. తేమశాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని అకాల వర్షాలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తడిసి నల్లగా అయిన పత్తిని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతు అదరూ ఏకమై జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -