కొత్త విధానంతో తగ్గుదల..!
న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదలను లెక్కించే విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ 2024ను ఆధారిత సంవత్సరంగా తీసుకుని కొత్త వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) సిరీస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త లెక్కల ప్రకారం జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదవగా, ఆహార ద్రవ్యోల్బణం 2.13 శాతంగా ఉంది. పాత సిరీస్ 2012 బేస్ ప్రకారం చూస్తే జనవరిలో ద్రవ్యోల్బణం 4.26 శాతంగా ఉండేది. కాగా.. దేశంలో ధరలను తగ్గించి చూపించేదుకు వీలుగా కేంద్రం ఈ నూతన ఎత్తుగడ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ కొత్త సిరీస్‌లో వస్తువుల సంఖ్యను 259 నుంచి 308కి, సేవల సంఖ్యను 40 నుంచి 50కి పెంచుతూ కేంద్ర గణాంకాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సిరీస్‌లో సమాచార సేకరణను 1,181 గ్రామీణ మార్కెట్లను 1,465కు, పట్టణ మార్కెట్లను 1,114 నుంచి 1,395కి పెంచింది. అదే విధంగా 12 ఇ-కామర్స్ సంస్థల నుంచి సమాచారం సేకరించనుంది. ఈ కొత్త విధానంలో ఆన్‌లైన్ సేవలకు పెద్దపీట వేశారు. గతంలో లేని విధంగా ఒటిటి సబ్‌స్క్రిప్షన్లు, ఆన్‌లైన్ మీడియా సేవలు, విమాన ప్రయాణ చార్జీలు, మొబైల్ చార్జీలు, సీఎన్‌జీ వంటి ఇంధన ధరలను కూడా ద్రవ్యోల్బణం లెక్కింపులోకి తీసుకున్నారు.
జనవరిలో 2.75 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
- Advertisement -
- Advertisement -



