Saturday, December 20, 2025
E-PAPER
Homeకరీంనగర్పదవీ విరమణ ఉద్యోగానికే కానీ.. సేవకు కాదు

పదవీ విరమణ ఉద్యోగానికే కానీ.. సేవకు కాదు

- Advertisement -

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
33 సంవత్సరాలు వైద్య ఆరోగ్యశాఖలో తన సేవలు అందించి అందరి మన్ననలు పొందిన సురేష్ ఉద్యోగానికే విరమణ కానీ ఆయన సేవకు కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పనిచేసే పదవి విరమణ పొందుతున్న కూన సురేష్ ఆత్మీయ అభినందన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ నిబద్ధత కలిగిన వ్యక్తి సురేష్ అని ఆయన నుంచి ఉద్యోగులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు, డాక్టర్ రమణారావు, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రాజేందర్, రాచ విద్యాసాగర్ గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -