సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. సినిమా రిలీజ్ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన కథానాయకుడు విజరు దేవరకొండ మాట్లాడుతూ, ‘నేను ‘గజిని’ సినిమా చూసి సూర్యతో ప్రేమలో పడిపోయాను. సూర్యని తెరమీద చూసి.. అసలు ఈ మనిషి బాడీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి? ఒక్కసారైనా జీవితంలో కలవాలి అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. నటుడిగా ఆయన సినిమాల ఎంపిక మిగతా నటుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. విభిన్న జోనర్స్‌లో సినిమాలు చేస్తుంటారు. ఈ సినిమాతో సూర్య మరో ఘన విజయాన్ని అందుకోవాలి’ అని అన్నారు.’కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీది లక్కీ హ్యాండ్ అని అంటుంటారు. నా తదుపరి చిత్రాన్ని ఆయన నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను’ అని కథానాయకుడు సూర్య చెప్పారు.
ఘనంగా ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక
- Advertisement -
RELATED ARTICLES