- Advertisement -
– సీఎం కార్యదర్శికి టీఎన్జీవోస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోపనపల్లిలో గతంలో ఉద్యోగులకు కేటాయించిన భూమిని తిరిగి వారికి అప్పగించాలని టీఎన్జీవోల కేంద్ర సంఘం కోరింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్షులు ఎం.జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ సీఎం కార్యదర్శి వి.శేషాద్రికి వినతిపత్రం సమర్పించారు. భూమి ఉద్యోగుల అధీనంలో లేకపోవడంతో జాతీయ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
- Advertisement -



